Teacher Recruitment Case:: సీఎం మమతకు బిగ్ షాక్.. వేల ఉద్యోగాలు రద్దు

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీకి కలకత్తా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై సోమవారం తీర్పు వెలువరిస్తూ 2016 మొత్తం ప్యానెల్‌ను రద్దు చేయాలని ఆదేశించింది.

Teacher Recruitment Case: బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2016 లో SSC రిక్రూట్‌మెంట్ ప్యానెల్ చెల్లదని కలకత్తా హైకోర్టు ప్రకటించింది. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంపై తీర్పును వెలువరిస్తూనే.. 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన అన్ని నియామకాలు ఫేక్ అని, నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కోర్టు గ్రూప్‌ సి, డి నియామకాలను కోర్టు రద్దు చేసింది. వివరాలలోకి వెళితే..

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీకి కలకత్తా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై సోమవారం తీర్పు వెలువరిస్తూ 2016 మొత్తం ప్యానెల్‌ను రద్దు చేయాలని ఆదేశించింది. 9, 10, 11, 12వ తరగతిలో గ్రూప్‌ సి, గ్రూప్‌ డిలో స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ చేసిన నియామకాలన్నీ చట్టవిరుద్ధమని పేర్కొంటూ, ఈ మేరకు 23,753 మంది ఉద్యోగాలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యక్తులు నాలుగు వారాల్లోగా 12 శాతం వడ్డీతో పాటు వారి మొత్తం జీతాన్ని తిరిగి ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యక్తుల నుంచి ఆరు వారాల్లోగా డబ్బులు వసూలు చేయాలని జిల్లా అధికారులను కోర్టు ఆదేశించింది.

We’re now on WhatsAppClick to Join

దీంతో పాటు జీరో పోస్టులపై కొత్త నియామకాలు ప్రారంభించాలని స్కూల్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని, ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. 23 లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా రానున్న 15 రోజుల్లో కొత్త నియామకాలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

Also Read: Kalki 2898 AD : చిరంజీవితో స్టార్ట్ అయ్యింది.. ఇప్పుడు అమితాబ్, విజయ్.. ఈసారైనా ప్రశంసలు..