Site icon HashtagU Telugu

Tearing Hijab: విద్యార్థిని హిజాబ్‌ను తీయించిన ఉపాద్యాయుడు

Tearing Hijab

Tearing Hijab

Tearing Hijab: జమ్మూకాశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి హిజాబ్‌ను తీయించిన ఘటనలో ఉపాధ్యాయుడిపై మంగళవారం కేసు నమోదైంది .

క్లాస్‌రూమ్‌లో కూర్చొని ఉండగా టీచర్ ఆమె వద్దకు వచ్చి బలవంతంగా తన హిజాబ్‌ను తీసివేసి చింపేసిందని ఆరోపిస్తూ ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు . కొంతకాలంగా అదే టీచర్ తనను, తన తోటి విద్యార్థులను వేధిస్తున్నాడని , అయితే ఈరోజు బలవంతంగా తన హిజాబ్‌ను తొలగించాడని ఆమె ఆరోపించింది. వేధింపుల విషయమై గతంలో తల్లిదండ్రులతో చెప్పినట్టు విద్యార్థిని తెలిపింది .ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఇతర సిబ్బందికి తాను పదేపదే నివేదించానని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని విద్యార్థిని వాపోయింది. కాగా అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై 354 IPC మరియు 9/10 POCSO చట్టం కింద పోలీసు స్టేషన్ బండిపొరలో కేసు నమోదైంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Also Read: Nara Lokesh : ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచార‌ణ‌.. రేపు మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌న్న సీఐడీ