Site icon HashtagU Telugu

TDP Worker on Cell Tower : చంద్రబాబు కు బెయిల్ ..ఓ ప్రాణాన్ని కాపాడిన పోలీసులు

tdp workers climb cell tower and threatened to jump demanding to chandrababu release

tdp workers climb cell tower and threatened to jump demanding to chandrababu release

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం (Skill Development Case) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) ను అరెస్ట్ చేశారనే వార్త అందర్నీ షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఓ సీనియర్ రాజకీయ వేత్త..14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ అందించిన మహానేతను హైడ్రామా నడుమ అరెస్ట్ చేయడం యావత్ ప్రజానీకం తట్టుకోలేకపోయింది. ఈ కేసులో చంద్రబాబు బయటకు వస్తారా రారా..? అనే ఉత్కంఠ నెలకొని ఉండగా..చంద్రబాబు అరెస్ట్ అనే వార్త విని పలు గుండెలు ఆగిపోతున్నాయి.

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే ఏడుగురు మృతి (TDP fans death) చెందగా.. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో మరో కార్యకర్త బలవన్మరణానికి పాల్పడ్డారు.ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని టెంకాయచెట్లపాలెం గ్రామానికి చెందిన వాయుల సుందరరావు (28) ఆదివారం (సెప్టెంబర్ 10) ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే సుందరరావుకు చంద్రబాబు అంటే అమితమైన అభిమానమని బంధువులు చెబుతున్నారు.

చంద్రబాబును అరెస్టు చేసిన వార్తలు న్యూస్ చానెల్స్ లలో చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడని.. శనివారం ఉలవపాడు, కందుకూరులో నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు (Inturi Nageswara Rao) చేపట్టిన నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. స్వగ్రామానికి తిరిగొచ్చిన తర్వాత.. చంద్రబాబు విషయంపై గ్రామస్థులతో చర్చిస్తూ సుందరరావు మనస్తాపానికి గురయ్యారని.. రాత్రి 9 గంటల వరకు అదే విషయంపై పదేపదే మదనపడ్డాడని బంధువులు తెలిపారు. ఆదివారం ఉదయం సొంత ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.

Read Also : AP : ఏసీబీ కోర్ట్ ఎదుట భారీగా కాన్వాయ్ సిద్ధం..ఏంజరగబోతుంది..?

ఇదిలా అంటే చంద్రబాబు ను వెంటనే విడుదల చేయాలనీ..లేదంటే సేల్ టవర్ ఫై నుండి దూకి చనిపోతానంటూ ఓ కార్యకర్త సేల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. మైదుగోళం గ్రామానికి చెందిన మంజునాథ్ (Manjunadh) టీడీపీ కార్యకర్త. టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా ఆయనకు అమితమైన అభిమానం. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారనే వార్త విని మంజునాథ్ ఆందోళనకు గురయ్యాడు. టీడీపీ జెండా చేత పట్టుకొని సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని, లేకుంటే.. సెల్ టవర్ మీద నుంచి దూకుతానని హెచ్చరించాడు.
మంజునాథ్ సెల్ టవర్ ఎక్కిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో..వారు ఘటన స్థలానికి చేరుకొని మంజునాథ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. అతడు వినిపించకపోవడం తో పోలీసులు తెలివిగా చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని చెప్పి కిందకు దింపారు. పోలీసుల మాటలు నిజమని నమ్మిన మంజునాథ్.. సెల్ టవర్ మీద నుంచి కిందకు దిగొచ్చారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.