TDP vs YCP : మూడేళ్లలో కనీసం ముగ్గురికైనా ఎస్సీ కార్పొరేషన్ రుణాలిచ్చారా..?

వైసీపీ ప్ర‌భుత్వం టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎమ్ఎస్ రాజు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికలకు ముందు దళితులకు మేనమామలా ఉంటానన్న జగన్ అధికారంలోకి వచ్చాక దొంగ మామలా తయారయ్యారని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Written By:
  • Updated On - June 9, 2022 / 09:53 AM IST

వైసీపీ ప్ర‌భుత్వం టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎమ్ఎస్ రాజు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికలకు ముందు దళితులకు మేనమామలా ఉంటానన్న జగన్ అధికారంలోకి వచ్చాక దొంగ మామలా తయారయ్యారని ఆయ‌న వ్యాఖ్యానించారు. జగన్ దళితులకు చేసిన న్యాయం కంటే అన్యాయమే ఎక్కువని.. జగన్ మోహ‌న్‌ రెడ్డి మూడేళ్లల్లో తన ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలకు ఖర్చు పెట్టినన్ని డబ్బులు కూడా దళితులకు ఖర్చు చేయలేదన్నారు.

మూడేళ్ల వైసీపీ పాలనలో కనీసం ఒక్కరికైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు గానీ స్వయం ఉపాధి యూనిట్లు గాని ఇవ్వలేదని ఎమ్ఎస్ రాజు ఆరోపించారు. వై.ఎస్.ఆర్ యంత్రసేవా కార్యక్రమంలో సందర్భంగా మాదిగ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని అడిగిన యువకుడికి ప్రశ్నకు జగన్ చెప్పిన సమాధానం చూస్తుంటే ఎస్సీ కార్పొరేషన్ అంటే జగన్ కు కనీస అవగాహన లేదని అర్ధమౌతోందన్నారు.

టీడీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా….. భూమిలేని ఎస్సీలకు రూ.135 కోట్లు ఖర్చుపెట్టి 3,000 ఎకరాల భూములు కొని అందజేశామ‌ని..రైతులకు ట్రాక్టర్లు, నిరుద్యోగ ఎస్సీ యువతకు పవర్ ఆటోలు, జేసీబీలు, ప్రొక్లైన్లు ఇచ్చామ‌ని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారికి ఇన్నోవా, ఇటియోస్ కార్లు ఇచ్చామ‌ని… కులాంతర వివాహాలు చేసుకున్న 1888 మందికి రూ.75 వేలు చొప్పున ఆర్ధిక సాయం చేశామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. మూడేళ్లల్లో దళితులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేసే ధమ్ము, దైర్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉందా? అని ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్ విదేశీవిద్య, అంబేద్కర్ ఓవర్సీస్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలు రద్దు చేసి దళితుల విద్యార్థులు భవిష్యత్తు గండి కొట్టారని… గత ప్రభుత్వం ఇచ్చిన ఋణాలు కూడా రద్దు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో దళితులపై దాడి జరిగని రోజు లేదని… దళితులకు అన్ని విధాలా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని ఎమ్ఎస్ రాజు హెచ్చ‌రించారు.