మరికాసేపట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం (TDP Parliamentary Party meeting) జరగనుంది. ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) నివాసంలో మధ్యాహ్నం 3.00 గంటలకు ఎంపీలు భేటీకానున్నారు. ప్రధానంగా చంద్రబాబు అరెస్టుపై పార్లమెంటులో నినదించేలా వ్యూహాలు రచించనున్నారు.
చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest), ఏపీలో ప్రస్తుత పరిస్థితులు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లేలా వ్యూహ రచన చేయనున్నారు. వివిధ పార్టీల మద్దతుతో చంద్రబాబు అరెస్టు అంశం ఉభయసభల్లో చర్చకు తీసుకెళ్లేలా కసరత్తు చేయనున్నారు. కాగా ఇప్పటివరకూ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతూ వచ్చేది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉండటంతో మొదటిసారి లోకేష్ ఆధ్వర్యంలో జరగనుంది.
గురువారం నారా లోకేష్ కు ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ను జాతీయ నేతలతో మాట్లాడేందుకు..అలాగే చంద్రబాబు అరెస్ట్ గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసేందుకు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. నిన్న పలు నేషనల్ మీడియా చానెల్స్ తో లోకేష్ మాట్లాడారు. అక్రమ కేసులో తన తండ్రి చంద్రబాబు ను అరెస్ట్ చేసారని..రాష్ట్రంలో నిజాయితీ పరులను జైలుకు పంపిస్తున్నారని..అక్రమంగా చంద్రబాబు ను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారని..చంద్రబాబు కు జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ నేతలంతా చంద్రబాబుకు సంఘీభావం తెలిపారని లోకేష్ చెప్పుకొచ్చారు.
Read Also : Theekshana Ruled Out: ఆసియా కప్ ఫైనల్ కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ
స్కిల్ డెవలప్ కేసులో ఇక్కడకూడా నగదు చేతులు మారినట్లు నిరూపించలేకపోయారని, ప్రభుత్వం దురుద్దేశ్యంతోనే చంద్రబాబు ఫై కేసులు పెట్టిందని లోకేష్ మండిపడ్డారు.స్కామ్ జరగలేదని నిరూపించే విలువైన పత్రాలు తనదగ్గర ఉన్నాయని లోకేష్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు బాగుండాలని జనసేన – టీడీపీ కలిసి పనిచేయబోతున్నాయని లోకేష్ ఈ సందర్బంగా తెలిపారు. ఏపీలో అత్యవసర పరిస్థితి ఏమైనా విదించారా..? అని ప్రశ్నించారు. తమ అధినేత చంద్రబాబు సింహం లాంటి వ్యక్తి అని, ఆయన దేనికీ భయపడరని నారా లోకేశ్ స్పష్టం చేశారు.