ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులను విజయవాడ ఎంపీ కేశినేని నాని ఖండించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో 1970వ దశకంలో ఉన్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగ్గా ఉందని చెప్పారు. గన్నవరం ఘటనలో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన టీడీపీ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తిని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామంలో ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. గురుమూర్తి అరెస్టును కేశినేని నాని ఖండించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్ మెరుగ్గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు పాలన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
TDP MP Kesineni Nani : ఏపీలో అభివృద్ధి జరగాలంటూ మళ్లీ చంద్రబాబు పాలన రావాలి – టీడీపీ ఎంపీ కేశినేని నాని

Kesineni Nani