Site icon HashtagU Telugu

TDP : చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ పతనం ప్రారంభ‌మైంది : ఎమ్మెల్సీ పంచుమ‌ర్తి అనురాధ

Panchumarthi Anuradh Imresizer

Panchumarthi Anuradh Imresizer

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ పంచుమూర్తి అనురాధ వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఆమె అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో సంబరాలు చేసుకున్న ప్రతి వైసీపీ నాయకుడికి పరిణామాలు తప్పవని ఆమె హెచ్చ‌రించారు. చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ పతనం మొదలైందన్నారు. 151 సీట్లున్న వైసీపీ 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని.. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని గేట్లు వేస్తారో కూడా తెలియని అంబటి రాంబాబు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదని హైకోర్టు చెప్పిందని, అయితే అంబటి న్యాయ వ్యవస్థకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. చంద్రబాబుపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో కేసులు పెట్టినా ఏమీ చేయలేకపోయారని, ఈ జగన్ ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు.