Site icon HashtagU Telugu

TDP : ప్రజల కోసం పోరాడేందుకు అసెంబ్లీకి వెళ్తాం- టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

Butchaiah

Butchaiah

ప్రజల కోసం పోరాడేందుకు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ స‌మావేశంలో నిర్ణ‌ఛం తీసుకున్న‌ట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును, ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి వాటిపై పోరాటం చేస్తుందన్నారు. అక్రమాలు జరగని చోట చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ అధికార పార్టీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి ఆరోపించారు. 2004 నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తులు, వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారన్న వాస్తవాన్ని అసెంబ్లీ వేదికపై వెల్లడిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు చట్ట విరుద్ధమని, స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీ వేదికపై గళం విప్పుతామన్నారు.