Site icon HashtagU Telugu

AP Assembly: ర‌చ్చ చేశారు.. స‌స్పెండ్ అయ్యారు..!

Ap Assembly Tdp Mlas Suspend

Ap Assembly Tdp Mlas Suspend

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారడం లేదు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి సస్పెండ్ చేశారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీలో సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గిస్తుండటంతో 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ త‌మ్మినేని ప్రకటించారు.

ఇక అసెంబ్లీలో ఈరోజు సభ ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు నాటుసారా విక్రయాలు, జంగారెడ్డిగూడెంలో జ‌రిగిన వరుస‌ మరణాలపై చర్చించాలని పట్టుబట్ట‌గా, అందుకు స్పీక‌ర్ ఒప్పుకోలేదు. ఈ క్ర‌మంలో మరోసారి స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ ఆందోళనకు దిగారు. దీంతో పదే పదే తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని స్పీకర్ సూచించినా టీడీపీ సభ్యులు ప‌దే ప‌దే నిర‌స‌న‌లు తెలియ‌జేస్తూ ఆందోళ‌న‌ల‌కు దిగారు. దీంతో వ‌రుస‌గా ఐదో రోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ త‌మ్మినేని సస్పెండ్ చేశారు. ఈ క్ర‌మంలో సభా గౌరవాన్ని దిగజార్చడమే లక్ష్యంగా తెదేపా సభ్యులు ప్రవర్తిస్తున్నారని, ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత‌లు పేర్కొన్నారు.