Site icon HashtagU Telugu

AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌..!

Tdp Members Suspended

Tdp Members Suspended

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ క్ర‌మంలో స‌భా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు నేడు కూడా అడ్డు తగిలారు. అసెంబ్లీలోమ‌రోసారి ఓవరాక్షన్ చేస్తూ స్పీకర్ పోడియం వైపు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. మ‌రోవైపు స్పీకర్ త‌మ్మినేని సీతారామ్ వారిస్తున్నా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారలేదు.

దీంతో సభను అడ్డుకోవడం టీడీపీకి ప్రతిరోజూ అలవాటుగా మారిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేప‌ధ్యంలో సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో మ‌రోసారి ఒక రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేస్తూ స్పీకర్ త‌మ్మినేని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్ర‌మంలో సత్యప్రసాద్‌, చినరాజప్ప, రామ్మోహన్‌, అశోక్‌, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెండ్ చేసిన‌ స్పీకర్, వారంతా తక్షణమే సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు.