Site icon HashtagU Telugu

AP CID : టీడీపీ మీడియా కోఆర్డినేట‌ర్ దార‌పనేని న‌రేంద్రని అదుపులోకి తీసుకున్న సీఐడీ

TDP

TDP

టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియా కోఆర్డినేట‌ర్‌గా ప‌ని చేస్తున్న దార‌పనేని న‌రేంద్ర‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని త‌న నివాసంలో ఉన్న నరేంద్ర‌ను పోలీసులు బ‌ల‌వంతంగా తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. న‌రేంద్ర అరెస్ట్‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఖండించారు. కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సీఐడీ పోలీసుల తీరుమారడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును కోర్టు తప్పు పట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. పార్టీ కార్యాలయంలో పని చేసే వారిని అరెస్టు చేసి భయపెట్టాలనే విధంగా సీఎం జ‌గ‌న్ వైఖ‌రి ఉంద‌న్నారు. ఇటువంటి కేసుల్లో 41 A నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెపుతున్నా….పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని చంద్ర‌బాబు ఖండించారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రి పూట చేస్తున్న అరెస్టులు కోర్టులో నిలబడవని చంద్రబాబు అన్నారు. వెంటనే నరేంద్రను విడుదల చేయాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు