Site icon HashtagU Telugu

TDP : టీడీపీ మీడియా కోఆర్డినేట‌ర్ న‌రేంద్ర‌కు బెయిల్ మంజూరు

TDP

TDP

టీడీపీ మీడియా కోఆర్డినేట‌ర్ దార‌ప‌నేని న‌రేంద్ర‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. న‌రేంద్ర ఇంట్లో ఉన్న స‌మ‌యంలో బుధ‌వారం రాత్రి సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం న‌రేంద్ర‌ను జ‌డ్జి ముందు హాజ‌రుప‌రిచారు. అయితే త‌న‌ను పోలీసులు కొట్టార‌ని జ‌డ్జికి చెప్ప‌డంతో జీజీహెచ్‌కి త‌ర‌లించి వైద్య ప‌రీక్ష‌లు చేయించాల‌ని జ‌డ్జి ఆదేశించారు. అర్థ‌రాత్రి రెండుగంట‌ల స‌మ‌యంలో జీజీహెచ్ వైద్యుల నివేదిక‌ను ప‌రిశీలించిన త‌రువాత న‌రేంద్ర‌కు బెయిల్ మంజూరు చేశారు.