New Districts: ఏపీలో కొత్త జిల్లాల లొల్లి .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నిర‌స‌న దీక్ష‌

అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా?...అసలు కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటి అని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ప్రశ్నించారు.

Published By: HashtagU Telugu Desk
Tdp

Tdp

విజయవాడ: అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా?…అసలు కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటి అని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ప్రశ్నించారు. తూర్పు కృష్ణాకు యన్టీఆర్‌ జిల్లాగా, పశ్చిమ కృష్ణాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని డిమాండ్ బుధవారం బోండా ఉమా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఉద్యోగాల ఏర్పాటుతో… కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా అని నిలదీశారు.

వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రం భగ్గుమంటుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల సమస్యలపై పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వంగవీటి రంగా పేరు విజయవాడ జిల్లాకు పెట్టాలన్నారు.

రంగా అభిమానులను కించ పరిచే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని బోండా ఉమా తెలిపారు. నిరసన దీక్షకు రాధారంగ మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను, బాల, కాపు సంఘం నేత బేతిన రాము హాజరయ్యారు.

  Last Updated: 09 Feb 2022, 03:18 PM IST