Nara Lokesh: తిరుపతమ్మ కుటుంబానికి లోకేశ్ సాయం

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో తిరుపతమ్మ అత్యాచారానికి గురైంది.

Published By: HashtagU Telugu Desk
Lokesh

Lokesh

ఇటీవల మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో తిరుపతమ్మ మృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురైంది. అదే రోజు తిరుపతమ్మ భౌతికకాయానికి నివాళులర్పించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చెయ్యడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు తిరుపతమ్మ కుటుంబ సభ్యులకు 5 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారు. తిరుపతమ్మ భర్త శ్రీనివాసరావు, కుమార్తె అఖిల, కుమారుడు వరుణ్ సాయికి సహాయాన్ని అందించారు.

తిరుపతమ్మ కుమార్తె పేరున రూ.3 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్, కుమారుడు వరుణ్ సాయి పేరు మీద రూ.2 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేసారు నారా లోకేష్. పిల్లలు ఇద్దరూ బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని లోకేష్ ఆకాంక్షించారు. ఎప్పుడూ ఏ సమస్య ఉన్నా అన్న గా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నారా లోకేశ్ వెంట తుమ్మపూడి టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షుడు నర్రా శ్రీనివాస రావు, దుగ్గిరాల టిడిపి మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, దుగ్గిరాల మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్ తో పాటు పలువురు దుగ్గిరాల మండలం టిడిపి నాయకులు పాల్గొన్నారు.

  Last Updated: 23 May 2022, 05:56 PM IST