Site icon HashtagU Telugu

TDP: టీడీపీ ఈ-పేపర్ ప్రారంభం

TDP epaper

TDP epaper

తెలుగు దేశం పార్టీ సొంత పత్రికను ప్రారంభించింది. చైతన్య రథం పేరుతో ఈ-పేపర్ ను చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. ఒక క్లిక్ తో సుమారు 30 లక్షల మందికి ఆ పేపర్ వెళ్ళింది. ఆ మేరకు టెక్నాలజీ ని రూపొందించారు. పార్టీ సమాచారంతో పాటు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పరిశోధనాత్మక కథనాలు ఈ-పేపర్ లో ఉంటాయని చంద్రబాబు ప్రకటించాడు.
అమరావతి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ-పేపర్ ను ఆవిష్కరించారు. వెబ్, ఫోన్ల ద్వారా ఈ-పేపర్ ను వీక్షించవచ్చు.
ఈ-పేపర్ ప్రారంభోత్సవం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచే ఆయుధమే ‘చైతన్యరథం’ అని అన్నారు. తమకు వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదన్నట్టు జగన్ సర్కారు వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
లక్షల మంది పార్టీ కార్యకర్తలకు సమాచార వారధిలా ‘చైతన్యరథం’ ఈ-పేపర్ పనిచేస్తుందని అన్నారు. ఒక్క క్లిక్ తో 30 లక్షల మందికి ఈ-పేపర్ వెళ్లిందని చెప్పారు