AP TDP: నిరుద్యోగ యువత కోసం టీడీపీ జాబ్ మేళా

AP TDP: పల్నాడులోని గురజాల నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆద్వర్యంలో వాగ్దేవి కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ‘‘ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించటంలో టీడీపీఅధినేతకే సాధ్యమని పార్టీ అధికారంలో ఉన్నా,లేకున్నా జాబ్ మేళ నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేయడం మా ప్రధాన లక్ష్యం. భారీ ఉద్యోగ మేళా నిర్వహింహచడం పై యువత హర్షం చూస్తుంటే ఎక్కడలేని […]

Published By: HashtagU Telugu Desk
Expected Jobs

Jobs employment

AP TDP: పల్నాడులోని గురజాల నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆద్వర్యంలో వాగ్దేవి కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ‘‘ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించటంలో టీడీపీఅధినేతకే సాధ్యమని పార్టీ అధికారంలో ఉన్నా,లేకున్నా జాబ్ మేళ నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేయడం మా ప్రధాన లక్ష్యం. భారీ ఉద్యోగ మేళా నిర్వహింహచడం పై యువత హర్షం చూస్తుంటే ఎక్కడలేని ఆనందం కలుగుతుంది’’ అని ఆయన అన్నారు.

‘‘టీడీపీ అధికారంలోకి రాగానే గురజాల నియోజకవర్గ పరిధిలో 400ఎకరాల భూమిని స్వాఫ్ట్వేర్ కంపెనీలకు కేటాయిస్తామని యువతకు హామీ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే పిడుగురాళ్ల పరిధిలో కూడా మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తాం. టీడీపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం’’ మాజీ ఎమ్మెల్యే జోస్యం చెప్పారు.

‘‘రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గంలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు యువత కోసం ప్రత్యేక పాలసీని తీసుకువస్తాం. ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేళా నిర్వహిస్తాం, నిరుద్యోగం అనేది లేకుండా నియోజకవర్గ యువతను అభివృద్ధి పథంలో నడిపిస్తాం. నియోజకవర్గంలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకోసం మా అధినేతలు చంద్రబాబు, లోకేష్ తో ప్రత్యేకంగా మాట్లాడి తప్పనిసరిగా యువతకు లబ్ది చేకూరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు’’ యరపతినేని అన్నారు.

  Last Updated: 27 Jan 2024, 08:26 PM IST