Site icon HashtagU Telugu

TDP- Janasena Alliance : టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్

Pawan Pottu

Pawan Pottu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో బరిలోకి దిగబోతున్నట్లు ఖరారు చేసారు. చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని.. కుట్ర పూరితంగా ఈ చర్యలు తీసుకున్నారని చెపుతూ వచ్చిన పవన్..ఈరోజు రాజమండ్రి జైల్లో బాలకృష్ణ , లోకేష్ లతో కలిసి పవన్ కల్యాణ్ చంద్రబాబు ను కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు చంద్రబాబు తో భేటీ అయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. చంద్రబాబుకు సంఘీభావం చెప్పేందుకే వచ్చాను..ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. అందులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేసారని తెలిపారు.

నేను తీసుకునే నిర్ణయాలు చాలా మందికి బాధ కలిగిస్తాయి. 2014లో కూడా ఇలాంటివి విన్నాను. దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే మోదీకి అప్పట్లో మద్దతు తెలిపాను. 2019లో పాలసీ విధానంతోనే చంద్రబాబుతో విభేదించాను. నేను ఓ నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడను. చంద్రబాబుపై మోపిన నేరం కూడా రాజకీయ కక్ష. దీన్ని సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ఇవాళ్టి భేటీ చాలా కీలకమైంది. ఈ భేటీ తో రాబోయే ఎన్నికల్లో పొత్తు ఫై ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఖరారు చేసారు. ఇద్దరం కలిసి బరిలోకి దిగబోతున్నట్లు తెలిపారు.

Exit mobile version