కుప్పం దాడి ఘటనపై స్థానిక టీడీపీ నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన సోదరులు లోకేష్, శరవన్ లకు మెరుగైన వైద్య సాయం అందించాలని స్థానిక నాయకులకు సూచించారు. స్థానిక క్వారీ లలో అక్రమాలను ప్రశ్నించినందుకే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారన్న టీడీపీ నేతలపై దాడుల చేశారని ఆరోపించారు. దాడిలో గాయపడిన బాధితుల ఆరోగ్య స్థితి పై తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్న చంద్రబాబు స్థానిక నేతలను ఆదేశించారు. తన కుప్పం టూర్ ముగిసిన రెండు రోజుల్లోనే దాడులు జరగడం పోలీసుల వైఫల్యం ఎండగడుతూ ఏపీ డీజేపీకి లేఖ రాశారు. ఇది పోలీసుల వైఫల్యమే అని చంద్రబాబు ఆరోపించారు.
Chandrababu Naidu: వైసీపీ దాడిని ఖండించిన చంద్రబాబు
