టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చింది. మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి పేరుతో ఇప్పటికే టీడీపీ కార్యక్రమాలు నిర్వహించింది. ఏపీలోనే కాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు, ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారంతా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తారు ఇటు ఐటీ ఉద్యోగులు సైతం వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. రేపు చంద్రబాబుకు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా `న్యాయానికి సంకెళ్లు’ పేరిట మరో విన్నూత నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు నిరసన చేపట్టాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గంటలకు చేతులకు తాడు, రిబ్బను కట్టుకొని నిరసన తెలపాలని నారా లోకేశ్ కోరారు. నిరసన తెలిపిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి.. ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ ప్రజలను కోరారు.
Also Read: Group 2 Student Suicide : 48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి.. ప్రవళిక సూసైడ్ పై గవర్నర్ తమిళిసై రియాక్షన్