టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పుట్టపర్తిలో ఆ పార్టీ నాయకులు బంద్ నిర్వహిస్తున్నారు. టీడీపీ బంద్‌కు మంచి స్పందన లభించింది. టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల కార్యకర్తలు తెల్లవారుజాము నుంచే బంద్ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలతో రోడ్డెక్కారు. ఇటు పార్టీ కార్యకర్తలు బంద్‌ను విధించకముందే ఇబ్బందులను ఊహించిన నగర వ్యాపారులు తమ దుకాణాలను ముందుగానే మూసివేశారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్ష పార్టీ నేతలను పోలీసులు ఇంకా గృహనిర్బంధం లోనే ఉంచారు.144 సెక్షన్ అమలులో ఉన్న దృష్ట్యా పట్టణంలో ప్రధాన రహదారులపై ప్రజలు గుమిగూడకుండా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా నేడు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. టీడీపీ అధ్యక్షుడి చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో ఏపీ వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
TDP : పుట్టపర్తిలో ప్రశాంతంగా కొనసాగుతున్న టీడీపీ బంద్

TDP calls for State bandh on Monday