Site icon HashtagU Telugu

TDP Formation Day : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర

Tdp Formation Day

Tdp Formation Day

‘సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ 42వ వసంతంలోకి అడుగు పెట్టింది. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఆవిర్భావమే ఒక చరిత్ర. అధికార దాహాంతో ఏర్పాటైన పార్టీ కాదు తెలుగుదేశం. తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలకడానికి పునాదైంది టీడీపీ. తెలుగు జాతి కీర్తి పతాకాల్ని.. తెలుగోడి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై పతాక స్థాయికి తీసుకేళ్లేందుకు ‘తెలుగు దేశం పిలుస్తోంది, రా కదలిరా’ అంటూ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao) పిలుపుతో 1982 మార్చి 29వ తేదీన పుట్టిందే తెలుగుదేశం పార్టీ. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందని దూరంలో ఉన్న రాజకీయం తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యుని ముంగిటకు చేరింది. చంద్రబాబు హయాంలో ఆ వెలుగు విశ్వవ్యాప్తం అయింది. ఎన్నో చారిత్రక ఘట్టాలకూ, సవాళ్లూ, సంక్షోభాలకు కేంద్ర బిందువుగా నిలిచింది టీడీపీ.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరింత వన్నె తెచ్చారు ఆ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎన్నో.. ఎన్నెన్నో.. తెలంగాణలో ఇప్పటి ఐటీ టెక్నాలజీకి పునాదులు వేసిన ఘనత ఆనాటి సీఎం చంద్రబాబుదే. తెలుగుదేశం పార్టీ పార్టీని ఎన్టీఆర్‌ తరువాత తెలుగు రాష్ర్ట్రంలో తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దారు. జాతీయ పార్టీలు సైతం టీడీపీని ఎదుర్కొలేక చతికిలపడ్డాయి.

అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అభిమానులకు, కార్యకర్తలకు పార్టీ అధినాయకుడు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఇదే రోజున ఎన్టీఆర్ టీడీపీని ప్రకటించారని గుర్తు చేశారు చంద్రబాబు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారని కొనియాడారు చంద్రబాబు.

వెనుకబడిన వర్గాల ప్రజలు ఓటర్లుగానే మిగిలిపోకూడదనే ఉద్దేశ్యంతో.. రాజకీయాల్లోకి వచ్చి తమ జాతిలో చైతన్య నింపాలనే మంచి భావనతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ స్థాపించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also : Kejriwal Arrest : కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి