Bandi Sanjay Shocking Video: అమిత్ షా చెప్పులు మోసిన ‘బండి’.. వీడియో వైరల్!

కేంద్రం హోంమంత్రి అమిత్ షా పర్యటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Published By: HashtagU Telugu Desk
Bandi

Bandi

కేంద్రం హోంమంత్రి అమిత్ షా పర్యటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆదివారం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాదరక్షలను (చెప్పులు) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ మోసికెళ్లిన వీడియో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది. వీడియోలో.. బండి సంజయ్ ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత అమిత్ షా పాదరక్షలను చేతులతో అందుకొని, ఆయన ధరించడానికి వీలుగా వాటిని నేలపై ఉంచడం వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. షా వెనుక ఉన్న సంజయ్ హడావుడిగా చెప్పుల దగ్గరకు వెళ్లి ఆయన ముందు పెట్టాడు.

ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత షా ఆలయాన్ని సందర్శించారు. మునుగోడులో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రత్యర్థి పార్టీలు బండి సంజయ్ తీరుపై పై విరుచుకుపడుతున్నాయి. ‘తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి కొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉంది’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బానిస బతుకులు అంటూ కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

  Last Updated: 22 Aug 2022, 03:54 PM IST