Site icon HashtagU Telugu

Bandi Sanjay Letter To KCR: పోడు సమస్యలపై కేసీఆర్ కు ‘బండి’ లేఖాస్త్రం!

పోడు సమస్యల కారణంగా ఆదివాసీలు, అటవీ శాఖాధికారుల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. అధికారుల లాఠీచార్జితో అమాయక గిరిజనులు తీవ్రంగా గాయపడుతున్నారు. ప్రాణాలు పోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోడు సమస్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు లేఖను సంధించారు. జులై 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘రెవెన్యూ సదస్సులో’’ పోడురైతులకు హక్కు పత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోడుభూముల సమస్య కేవలం రెవెన్యూ శాఖకే పరిమితమైంది  కాదు, అటవీ శాఖతో కూడా ఈ సమస్య ముడిపడి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సందస్సులో అటవీ శాఖను కూడా భాగస్వామ్యం చేయాలని బండి సంజయ్ కోరారు. బీజేపీ నాయకులు పోడురైతులకు హక్కుపత్రాలివ్వాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు అనేక వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు, అనేక ఆందోళనకార్యక్రమాలు చేపట్టారనీ, పోడురైతులకు హక్కుపత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటే అదే పదివేలు అని బండి సంజయ్ సీఎంకు రాసిన లేఖలో వివరించారు.