Site icon HashtagU Telugu

TBJP: మహిళా రిజర్వేషన్ పట్ల టీబీజేపీ మహిళా నేతలు హర్షం

Dk Aruna

Dk Aruna

ఎన్నికల ముగింట బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో  మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రం ఈ బిల్లుకి నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు పెట్టింది. కానీ 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్ట సభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180 స్థానాలకు పెరుగుతాయి.

అయితే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టడాన్ని తెలంగాణ బీజేపీ మహిళా నేతలు స్వాగతించారు. మోడీ నిర్ణయం పట్ల మహిళల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో  బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు D K Aruna , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి  ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం, టపాకాయలు పేల్చి సంబురాలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Anushka: బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తున్న అనుష్క