Kishan Reddy: ప్రధాని మోడీ హాయంలో దేశంలో పౌరులు సురక్షితంగా జీవిస్తున్నారని, మత కలహాలు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అవ్వకముందు తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు ఉండేవారని చెప్పారు. హైదరాబాద్ గోకల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్, లుంబిని పార్క్‌లో మూడుచోట్ల ఒకేసారి బాంబు బ్లాస్ట్‌లు జరిగాయని చెప్పారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న రైళ్లలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు.
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పదేళ్లలో మతకలహాలు, కర్ఫ్యూలు, ఏకే47లు, ఆర్‌డీఎక్స్‌లు లేవని చెప్పారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వేళ్లు పాతుకుని భారత్‌ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందన్నారు కిషన్‌రెడ్డి. మతకలహాలు ప్రేరిపించాలని చూశారనీ.. ఏకే 47లు పంపేవారని కిషన్‌రెడ్డి అన్నారు. అయతే.. ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పరిస్థితులను మార్చేశారని కిషన్‌రెడ్డి అన్నారు.
భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. గతంలో ఇండియన్ కరెన్సీని పాకిస్థాన్‌లో నకిలీ కరెన్సీగా ముద్రించి.. ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను నడిపేవారని చెప్పారు. ఇవాళ పాక్‌లో ప్రజలు రొట్టె ముక్క కోసం కొట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.