Site icon HashtagU Telugu

Pakistan: పాకిస్థాన్‌లో టాక్సీ డ్రైవర్ దారుణ హత్య

Pakistan

New Web Story Copy (100)

Pakistan: పాకిస్థాన్‌ కరాచీలో ముంతాజ్ అనే టాక్సీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. టాక్సీవాలా ముంతాజ్ ను అతి దారుణంగా కాల్చి చంపేశారు. శనివారం ముంతాజ్ కొంతమంది ప్రయాణికులను జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూ కరాచీకి తీసుకెళ్తుండగా, కొంతమంది దోపిడీ దొంగలు బిలాల్ కాలనీ పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాన్ని ఆపి దోపిడీకి యత్నించారు. దాంతో దుండగులపై ముంతాజ్ తిరగబడటంతో దుండగులు అతనిని కాల్చి చంపారు, దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంతాజ్ నథియా గాలి నివాసి, గ్రీన్ టౌన్‌లో నివసిస్తున్నాడు. ముంతాజ్ సోదరుడు రియాజ్‌ను కూడా ఎనిమిదేళ్ల క్రితం దుండగులు హతమార్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో తీవ్రవాద ఘటనలు పెరిగాయి. 2023 మొదటి ఏడు నెలల్లో పాకిస్తాన్‌లో 18 ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఇందులో 200 మంది ప్రాణాలు కోల్పోగా, 450 మందికి పైగా గాయపడ్డారు.

Also Read: Massive Blast : ఏడుగురు సజీవ దహనం.. భారీ పేలుడుతో చెల్లాచెదురుగా శరీర భాగాలు