Raids On Gold Traders: ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వరకు ఆదాయపు పన్ను శాఖ విస్తృతంగా దాడులు నిర్వహించింది. బంగారం వ్యాపారం చేస్తున్న నగల వ్యాపారులు, వారి స్థలాలపై ఈ దాడులు (Raids On Gold Traders) నిర్వహిస్తున్నారు. ఈ బులియన్ వ్యాపారులు అక్రమంగా డబ్బు డిపాజిట్ చేసి రియల్ ఎస్టేట్‌లో వాడుకున్నారని ఐటీ శాఖ చెబుతోంది. ఈ దాడిలో బంగారం వ్యాపారుల నుంచి అన్ని లావాదేవీలు, ఇతర పత్రాలను ఆరా తీయడంతో పాటు ఆదాయపు పన్నుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా సేకరించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు
పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు, విక్రయాలకు పాల్పడుతున్న బులియన్ వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఘజియాబాద్, నోయిడా, కాన్పూర్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, ఢిల్లీ సహా పలు నగరాల్లో ఈ దాడులు జరిగాయి. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖకు చెందిన పలు బృందాలను ఏర్పాటు చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు.
Also Read: NEET UG Counselling: త్వరలో నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ.. కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే..!
వ్యాపారుల ఇళ్లకు చేరుకున్న బృందం
నివేదిక ప్రకారం.. బులియన్ వ్యాపారులతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రదేశాలలో కూడా దాడులు నిర్వహిస్తున్నారు. విచారణలు, దాడుల అనంతరం పేర్లు బయటకు వస్తున్న వ్యాపారుల ఇళ్లకు కూడా బృందాలు చేరుతున్నాయి. ఈ వ్యాపారులు భారీగా పన్ను తారుమారు చేసి బంగారం కొనుగోలు, అమ్మకాల ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. తద్వారా ఈ వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖ రాడార్‌లోకి రారు. ప్రస్తుతం ఈ రైడ్‌లో ఏం దొరికిందో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సమాచారం ఇవ్వలేదు. కానీ, ఈ భారీ రైడ్‌లో ఐటీ శాఖ ఎదుట పలువురు వ్యాపారుల అక్రమాస్తులు పలు కీలక పత్రాలు వచ్చాయని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా కొందరు వ్యాపారాలు భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసి విక్రయిస్తూ ఆదాయపు పన్ను శాఖను మోసం చేసే పనిలో ఉన్నారు.