Site icon HashtagU Telugu

CM Jagan : `టాటా`ప్ర‌తినిధులతో సీఎం జగ‌న్ భేటీ

Ys Jagan Meeting

Ys Jagan Meeting

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. రక్షణ విమానయాన రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ రెగ్యులేటరీ హెడ్ జె.

శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఎలాంటి సహకారం కావాల‌న్నా ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.