Tamil Nadu: కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం

తమిళనాడులో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1నుండి 10 వరకు ఆంక్షలు విధించింది. శుక్రవారం ఒక తమిళనాడు లోనే 76 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ మీటింగులు, ఈవెంట్లను ఇదివరకే రద్దు చేసిన నేపథ్యంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఇతర కమర్షియల్ స్థలాల్లో 50 శాతం మందికి మించకూడదని ఆదేశించింది. 8వ తరగతి వరకు విద్యార్థుల భౌతిక హాజరును నిరాకరించింది. 8వ తరగతి పై విద్యార్థులకు 50% […]

Published By: HashtagU Telugu Desk
Template 2021 12 30t164111

Template 2021 12 30t164111

తమిళనాడులో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1నుండి 10 వరకు ఆంక్షలు విధించింది. శుక్రవారం ఒక తమిళనాడు లోనే 76 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ మీటింగులు, ఈవెంట్లను ఇదివరకే రద్దు చేసిన నేపథ్యంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఇతర కమర్షియల్ స్థలాల్లో 50 శాతం మందికి మించకూడదని ఆదేశించింది. 8వ తరగతి వరకు విద్యార్థుల భౌతిక హాజరును నిరాకరించింది. 8వ తరగతి పై విద్యార్థులకు 50% హాజరు తో భోధన చేపట్టాలని ఆదేశించింది. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం పాటించాలని కోరింది.

  Last Updated: 01 Jan 2022, 05:02 PM IST