రూ.10 నాణేలతో కారు కొన్న వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 08:30 AM IST

తాజాగా తమిళనాడుకు చెందిన వెట్రివేల్ అనే వైద్యుడు ఒక కారును కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే కారును కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించడంలో వింత ఏముంది అని అనుకుంటున్నారా. అది ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పవచ్చు. తమిళనాడుకు చెందిన వెట్రివేల్ అనే వ్యక్తి రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలు పోగు చేసి వెట్రివేల్ ఓ కారును కొనుగోలు చేశాడు. కాగా వెట్రివేల్ కుటుంబం స్మార్ట్ కిడ్స్ పబ్లిక్ స్కూల్ పేరిట ఓ పాఠశాలను నిర్వహిస్తోందట.

ఆ పాఠశాలకు చెందిన చిన్నారులు రూ.10 నాణేలను ఉత్త రేకు బిళ్లలుగా భావిస్తూ ఆడుకోవడం వెట్రివేల్ గమనించి రూ.10 నాణేలు చెల్లవని సమాజంలో జరుగుతున్న ప్రచారం కారణంగానే, ఆ పది రూపాయల నాణేలు చిన్న పిల్లల చేతిలో ఆటవస్తువులుగా మారాయని గుర్తించి వెంటనే , రూ.10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని నిరూపించాలని నిర్ణయించుకున్నాడట. ఆ విధంగా సమాజంలో చాలామంది అనుకుంటున్న విషయం తప్పు అని నిరూపిస్తూ ఈ విధంగా కారును కొనుగోలు చేశారట.

అయితే ఒకరోజు అతను హోటల్ కి వెళ్లి తిని అనంతరం బిల్లు చెల్లించే సమయంలో రూ.10 నాణెం ఇవ్వగా, క్యాషియర్ తిరస్కరించడం వెట్రివేల్ ను అసంతృప్తికి గురయ్యి ఎందుకు తీసుకోవని అడగగా ఆ క్యాషియర్ దురుసుగా మాట్లాడడం వెట్రివేల్ పట్టుదల రెట్టింపు అయ్యిందట. అంతే కాకుండా ఫేక్ నాణేలు ఇస్తున్నారంటూ ఆ క్యాషియర్ వాదించడంతో తమిళ యువకుడిని వెంటనే కార్యరంగంలోకి దూకేలా పురిగొల్పి కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో రూ.10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని చేసిన ప్రకటనతో వెట్రివేల్ మరింత ధైర్యం తెచ్చుకున్నాడట.అలా నెలరోజుల వ్యవధిలో రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలు సేకరించాడు. వాటిసాయంతో ఓ కారు కొనుగోలు చేసి, రూ.10 నాణేలు కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని అందరికీ చాటాలని నిర్ణయించుకుకొని ఆ మేరకు కారు డీలర్ ను ఒప్పించి, అన్నీ రూ.10 నాణేలతోనే కారు కొనుగోలు చేశాడట.