Dasoju Sravan: తమిళిసై తప్పుడు నిర్ణయం వల్ల మా జీవితాలు నాశనం : దాసోజు శ్రవణ్

Dasoju Sravan: మాజీ గవర్నర్ తమిళిపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని అంటూనే తనకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసేందుకై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలలో మీకున్న విస్తృతమైన అనుభవం మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో తప్పకుండా తోడ్పడుతుందని భావిస్తున్నాను. మార్చి 7, 2024 నాటి WP 180 & 181 కేసుల్లో […]

Published By: HashtagU Telugu Desk
dasoju sravan BRS

dasoju sravan BRS

Dasoju Sravan: మాజీ గవర్నర్ తమిళిపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని అంటూనే తనకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసేందుకై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలలో మీకున్న విస్తృతమైన అనుభవం మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో తప్పకుండా తోడ్పడుతుందని భావిస్తున్నాను.

మార్చి 7, 2024 నాటి WP 180 & 181 కేసుల్లో ఇటీవలి హైకోర్టు ఆదేశాల తర్వాత న్యాయం గెలుస్తుందని ఆశించి మీకు విన్నవించుకున్నాం. కోర్టు ఆదేశాలు అమలు చేయండి, రాజ్యాంగాన్ని కాపాడండి, మా లాంటి వెనుకబడినవర్గాలకు చెందినవారికి న్యాయం చేయమని చేతులు జోడించి నమస్కారించాం. మీరు మీ మునుపటి చట్ట విరుద్దమైన నిర్ణయాన్ని సరిచేసి మమ్మల్ని శాసన మండలి సభ్యులు గా నియమిస్తారని ఎంతగానో ఆశించాం’’ అని దాసోజు అన్నారు.

‘‘గత ప్రభుత్వం పట్ల మీకున్న రాజకీయ శత్రుత్వం ప్రదర్శించారు. రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టిస్తూ , చట్టవిరుద్ధమైన మీ నిర్ణయంతో మా కెరీర్‌లు, భవిష్యత్తు, జీవితాలు నాశనం చేశారనే విషయాన్నీ గుర్తిస్తూ, మీరు దయతో ఆత్మ శోధన చేసుకోవాలని విజ్ఞప్తి. మీ తప్పుడు నిర్ణయం వల్ల మా జీవితాలు నాశనం అయినప్పటికీ, మీ రాజకీయ జీవితంలో మీరు తప్పనిసరిగా విజయం సాధించాలి’’ అని దాసోజు అన్నారు.

  Last Updated: 18 Mar 2024, 05:48 PM IST