Site icon HashtagU Telugu

Vishal: హీరో విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి…ఏం జరిగిందంటే..!!

Vishal 2

Vishal 2

తమిళహీరో విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి జరిగింది. కొంతమంది గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషయంపై విశాల్ పర్సనల్ మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విశాల్ తన కుటుంబంతోకలిసి అన్నానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోఉంటున్నారు. సోమవారం రాత్రి రెడ్ కలర్ కారులో వచ్చిన దుండగులు రాళ్లతో దాడి చేశారు. విశాల్ ఇంటి అద్దాలు లైటింగ్ సిస్టమ్ దెబ్బతిన్నది.

దుండగులు దాడి చేసిన ద్రుశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా దాడి జరిగిన సమయంలో విశాల్ ఇంట్లో లేరు. షూటింగ్ కోసం వేరే ప్రాంతంలోఉన్నారు. విశాల్ అంటే చిత్రపరిశ్రమలో గిట్టనివారే ఈ దాడికి పాల్పడ్డారా లేదా..మరేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.