Site icon HashtagU Telugu

Tamilnadu: పెళ్ళై నెల కాకుండానే అలాంటి పనిచేసిన వరుడు.. స్మశానవాటికకు వెళ్లి అలా?

Tamilnadu

Tamilnadu

ప్రస్తుత సమాజంలో చాలామంది చిన్న చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకోవడంతో పాటుగా కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. రెప్పపాటి కాలంలో నిర్ణయాలు తీసుకొని చంపడం,చావడం వరకు కూడా వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులు కూడా గడవకముందే నవ వధువు వరులు ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.

ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. తిరువారూర్‌ జిల్లా ముత్తుప్పేట సమీపంలోని కోవిలూరు శ్మశాన వాటిక సమీపంలో సోమవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకుని యువకుడు మృతి చెందాడు. అది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించార.

అంతరం పోలీసులు విచారణ జరపగా అయిపోయిన ఆ యువకుడు ముత్తుపేట సమీపంలోని కోవిలూరు ఉత్తర అటవీ ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ కుమారుడు సంతోష్‌ అని తేలింది. మంగళూరుకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. పెళ్లికి నిరాకరించడంతో యువతి ముత్తుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి రాజీ చేసి నెల క్రితం పెళ్లి చేశారు. ఈ క్రమంలో అతను సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version