తమిళనాడు లోని పుదుకోట్టై జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియాల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి గాల్లోకి కాల్చిన బుల్లెట్టు రెండు కిలోమీటరు దూరంలో ఆడుకుంటున్న పదకొండు సంవత్సరాల చిన్నారి తలకు తాకి మరణించాడు. బుల్లెట్టు తాకిన బాలుడిని తంజావూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన పై దర్యాప్తు చేపట్టి నింధితులను శిక్షించాలని ఆదేశించారు. మరణించిన బాలుడి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
కాగా.. ఈ ఘటన పై తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తాయి సెక్యూరిటీ సిభంది శిక్షణ స్థావరాన్ని అక్కడినుండి మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇంతకుముందు కూడా చోటు చేసుకున్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీస భద్రతా చర్యలు చేపట్టకుండా గాల్లోకి కాల్పులు జరపడం పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా.. సెంట్రల్ ఇండస్ట్రియాల్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది.