Site icon HashtagU Telugu

Tamannaah: కొడ్తే అంటూ అదరగొట్టిన మిల్క్ బ్యూటీ..గని నుంచి స్పెషల్ సాంగ్..!!

Kodthe song

Kodthe song

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని అనే స్పోర్ట్స్ డ్రామా మూవీతో ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి కొడ్తే వీడియో సాంగ్ ను మూవీ మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఉపేంద్ర , సునీల్ శెట్టి, జగపతిబాబు మెయిన్ రోల్సో లో నటించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్దు ముద్దా, అల్లు బాబీ ఈ మూవీని నిర్మించారు. కాగా అల్లుఅరవింద్ సమర్పణలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తమన్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ నుంచి కొడ్తే అనే స్పెషల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఇక ఇప్పటికే రిలీజైన కొడ్తే లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇఫ్పుడు రిలీజ్ అయిన వీడియో సాంగ్ లో తమన్నా సిజ్లింగ్ ఫర్మార్మెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ పూర్తిగా న్యూ లుక్ లో కనిపించనున్నారు. వరణ్ లుక్స్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేశాయి. ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ బాక్సర్ గా నటిస్తుండగా…ఏప్రిల్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Exit mobile version