America: వామ్మో.. 11 అడుగుల ఎత్తుతో భూమిపై అరుదైన వ్యక్తి.. సరికొత్త రికార్డు?

ప్రపంచవ్యాప్తంగా చాలామంది అనేక రకాల రికార్డులను సృష్టిస్తూ ఉంటారు. అయితే ఎవరైనా ప్రపంచ రికార్డులు సృష్టిస్తే

  • Written By:
  • Publish Date - December 9, 2022 / 07:04 PM IST

ప్రపంచవ్యాప్తంగా చాలామంది అనేక రకాల రికార్డులను సృష్టిస్తూ ఉంటారు. అయితే ఎవరైనా ప్రపంచ రికార్డులు సృష్టిస్తే వాటిని బీట్ చేస్తూ మరొకరు ప్రపంచ రికార్డులను సృష్టిస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ చరిత్రలో ఎవరు బీట్ చేయని కొన్ని ప్రపంచ రికార్డులు అలాగే ఉన్నాయి. అలా చరిత్రలో కొన్ని రికార్డులు ఏళ్ల తరబడి ఒక వ్యక్తి పేరు పై ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు అతని రికార్డును ఎవరు బీట్ చేయలేకపోయారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. అత్యంత ఎత్తైన వ్యక్తి అద్భుతమైన చిత్రం అనే క్యాప్షన్ తో ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్.

ఆ ఫోటోలో అతనితో పాటు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక చిన్న పిల్లవాడితో సహా మొత్తం 6 మంది ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆ వ్యక్తి పేరు రాబర్ట్ వాడ్లో, అతను చరిత్రలో అత్యంత ఎత్తైన వ్యక్తిగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే ఈ రికార్డ్ 80 సంవత్సరాల క్రితం నెలకొల్పబడిన ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరు బీట్ చేయలేకపోయారు. 1940 తర్వాత అతని ప్రపంచ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. కాగా రాబర్ట్ ఎత్తు ఎనిమిది అడుగుల 11.1 అంగుళాలు. రాబర్ట్ తర్వాత ఇంత పొడుగ్గా ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు భూమి పై పుట్టలేదు. చరిత్రలో అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అతని పేరు నమోదు కావడానికి కారణం ఇదే.

 

రాబర్ట్ అమెరికాలోని ఆల్టన్ నగరంలో ఫిబ్రవరి 22, 1918న జన్మించాడు. అయితే రాబర్ట్ కేవలం 6 నెలల వయసులో పొడవు 3 అడుగులకు దగ్గరగా ఉండేదని, సాధారణంగా పిల్లలు ఆ ఎత్తుకు చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు నిపుణులు. రాబర్ట్ 5 సంవత్సరాల వయసులో 5 అడుగుల 6 అంగుళాల కంటే ఎక్కువ పొడవుగా ఎదిగాడు. ఆ తరువాత రాబర్ట్ 12 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి సుమారు 7 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. 1936లో రాబర్ట్‌కి 18 ఏళ్లు నిండినప్పుడు అతను పొడవు 8 అడుగుల 4 అంగుళాలకు చేరుకున్నాడు. దీంతో అప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తుల రికార్డులన్నింటినీ దాటి సరికొత్త రికార్డ్ ను సృష్టించాడు. అతను షూ నంబర్ 37AA. ఈ షూ అతని కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. అయితే.. రాబర్ట్ కేవలం 22 సంవత్సరాల వయస్సులో 1940లో మరణించాడు. అయితే 1940 నుంచి ఇప్పటివరకు కూడా రాబర్ట్ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.