Steel Bridge Incident : ఆ బాధతోనే అలా కొట్టాను క్షేమించండి – తలసాని

వివాదాలకు దూరంగా ఉంటె మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Thalasani Srinivas Yadav)..రీసెంట్ గా ఓ వ్యక్తిని కొట్టి వార్తల్లో నిలిచారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్(Hyderabad Flyover) ప్రారంభోత్సవంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు(Rajesh Babu ) మంత్రి కేటీఆర్ వెనకాల వెళ్తుండగా..మంత్రి తలసాని అతన్ని అడ్డుకుని చెంపపై కొట్టారు. ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మంత్రి తీరుపై లంబాడీ సంఘాలు తీవ్ర ఆగ్రహం […]

Published By: HashtagU Telugu Desk
Talasani Srinivas Yadav Apology

Talasani Srinivas Yadav Apology

వివాదాలకు దూరంగా ఉంటె మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Thalasani Srinivas Yadav)..రీసెంట్ గా ఓ వ్యక్తిని కొట్టి వార్తల్లో నిలిచారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్(Hyderabad Flyover) ప్రారంభోత్సవంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు(Rajesh Babu ) మంత్రి కేటీఆర్ వెనకాల వెళ్తుండగా..మంత్రి తలసాని అతన్ని అడ్డుకుని చెంపపై కొట్టారు. ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మంత్రి తీరుపై లంబాడీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తలసానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

ఈ క్రమంలో ఈ ఘటన ఫై తలసాని స్పందించారు. జనం రద్దీ ఉన్న(Steel Bridge ) కార్యక్రమంలో అనుకోకుండా ఓ వ్యక్తి బూటుతో తన కాలును తొక్కడంతో రక్తస్రావమైందని, ఆ బాధలో ముందున్న వ్యక్తిని వెనక్కి లాగానని అన్నారు. అతను గిరిజనుడు భైంసా ఏఎంసీ చైర్మన్‌ రాజేష్‌కుమార్‌ బాబు అని తెలిసిందని, వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి పొరపాటు జరిగిందని, క్షమాపణ చెప్పానని అన్నారు. ఈ ఘటనపై అతనితో పాటు గిరిజన సమాజానికి క్షమాపణ చెబుతున్నానని అన్నారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో విషయం పెద్దది చేసి చూపుతున్నారని.. తాను బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, దళిత బిడ్డలు, వెనకబడిన వర్గాలు, మైనారిటీల గొంతుకనని అన్నారు. ఎటువంటి బేషజం లేకుండా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

Read Also : Cancer: దాల్చిన చెక్కతో క్యాన్సర్ కు చెక్.. NIN సర్వేతో ఫుల్ క్లారిటీ

  Last Updated: 26 Aug 2023, 11:49 AM IST