10th Results Issue : ఓపెన్ డిబేట్ ఛాలెంజ్ !

ఏపీలోని టెన్త్ ప‌రీక్షా ఫ‌లితాల‌పై ఓపెన్ టిబెట్ కు రావాల‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేసిన స‌వాల్ కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌తి స‌వాల్ విసిరారు.

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh1

Nara Lokesh1

ఏపీలోని టెన్త్ ప‌రీక్షా ఫ‌లితాల‌పై ఓపెన్ టిబెట్ కు రావాల‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేసిన స‌వాల్ కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌తి స‌వాల్ విసిరారు. చర్చలో పాల్గొనేందుకు పార్టీ సిద్ధంగా ఉందని, బహిరంగ చర్చకు నారా లోకేష్ లేదా చంద్రబాబు నాయుడు హాజరు కావాలని కండిష‌న్ పెట్టారు. అనుచిత వ్యాఖ్య‌లతో దుర్భాషలాడడం మానుకోవాల‌ని టీడీపీకి హిత‌వు ప‌లికారు. సంస్కారం లేకపోవడం నారా లోకేష్‌కు పుట్టినప్పటి నుండి సమస్యగా ఉంద‌ని సాయిరెడ్డి దుయ్యబట్టారు. జూమ్ మీటింగ్‌లో ‘కంస మామ జగన్స అంటూ లోకేష్ మాట్లాడ‌డం ఆయ‌న జుగుప్సాకరమైన ప్రవర్తనను ప్రతిబింబిస్తుంద‌ని అన్నారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ జూమ్ మీటింగ్ సెషన్ నుంచి పారిపోయిందంటూ ఎద్దేశా చేశారు.

జూమ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డం కేవ‌లం ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లోనూ మా ఎదురుదాడిని మరింత ఉధృతం చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.10వ తరగతి ఫలితాలపై వాస్తవాలు తెలుసుకోకుండా సీఎంను దుర్భాషలాడడం ఏమిటని ప్రశ్నించారు. మా నేతలను దూషించే ముందు నిజానిజాలు చెక్ చేసుకోండి అంటూ లోకేష్ సవాల్‌ని స్వీకరించారు. త‌మ‌తో చ‌ర్చకు చంద్రబాబు నాయుడు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని ప్ర‌తిస‌వాల్ చేశారు.

  Last Updated: 11 Jun 2022, 03:42 PM IST