Smart Phones: ఫిబ్రవరిలో లాంఛ్ కానున్న స్మార్ట్ ఫోన్లు…ఓ లుక్కేయండి.!

కొత్త సంవత్సరం వేళ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 01:32 PM IST

కొత్త సంవత్సరం వేళ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఫోన్ లాంఛ్ అవ్వకముందే…ఆయా ఫోన్ల గురించి చాలా రిపోర్టులు వస్తున్నాయి. ఈలోపు మీరు కూడా ఫోన్ కొనాలని ప్లాన్ చేసుకుంటే…ఫిబ్రవరి 2022లో లాంఛ్ కానున్న మొబైల్ ఫోన్ల జాబితా గురించి తెలుసుకోండి. ఈ లిస్టులో సామ్ సంగ్, రెడ్ మీ, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

రెడ్ మీ నోట్ 11s: షియోమీ ఇండియా రెడ్ మీ నోట్ 11s స్మార్ట్ ఫోన్ను ఫిబ్రవరి 9న భారత్ లో లాంఛ్ చేయనున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అధికారిక టీజర్ ప్రకారం…ఫోన్లో క్వాడ్ రియర్ సెటప్ ఇవ్వబడుతుంది. ఇది బ్లూ కలర్ ఆప్షన్ లో వస్తుంది. ఈ ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ ఐసోసెల్ హెచ్ఎం 2 సెన్సార్ ను కలిగి ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సోనీ imx355 ఆల్ట్రావైడ్ యాంగిన లెన్స్ తోపాటు 2 మెగాపిక్స్ ఓమ్నివిజన్ ov2A మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలిగి ఉంటుంది. రెడ్ మీ నోట్ 11ఎస్ 8జిబి ర్యామ్, 128 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది.

సామ్ సంగ్ గెలాక్సీ S22సిరీస్: సామ్ సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 22, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 22+, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా…ఈ మూడు ఫోన్లు ఫిబ్రవరి 9, 2022న లాంఛ్ కానున్నాయి. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 22 సిరీస్ ఈ ఏడాది అత్యంత ప్రత్యేకమైన ఫోన్ గా పిలువబడుతోంది. ఈ సిరీస్ పై చాలా కాలంగా రూమర్స్, లీక్ లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ గురించి సాంసంగ్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

రియల్ మీ 9 ప్రో, రియల్ మీ 9 ప్రో + ఈ నెలలో లాంఛ్ అవుతాయి. రియాలిటీ 9 ప్రో +కి సంబంధించి….ఇది 90HZ రిఫ్రెస్ రేట్ AMOLEDడిస్ప్లే, మీడియటెక్ డైమెన్షన్ 920 ,5జి చిప్ సెట్ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ట్రిపుల్ రియర్ కమెరా సెటప్ ఉంది. మరోవైపు రియల్ మీ 9 ప్రో 120HZరిఫ్రెష్ రేట్, 6.6 అంగుళాల ఆల్మోడ్ డిస్ ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఇది స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 8జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజీతో రిలీజ్ కానుంది. ఇది 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది.

ఒప్పో రెనో 7 సిరీస్ : ఒప్పో రెనో సిరీస్ లో ఒప్పో రెనో 7 5జి, ఒప్పో రెనో 7 ఎస్ఈ 5జి , రెనో 7ప్రో 5జీ మొబైల్ ఫోన్లు ఫిబ్రవరి 4న లాంఛ్ అవుతుందని గతంలోనే లీక్ అయ్యింది. ఇక ఈ ఫోన్ గతేడాది చైనాలో లాంఛ్ అయిన విషయం తెలిసిందే.