T9 Golf Challenge: నేటి నుంచే టీ-9 గోల్ఫ్ ఛాలెంజ్ టోర్నీ

తెలంగాణలో యువగోల్ఫర్లను ప్రోత్సహించేందుకు టీ గోల్ఫ్ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న టీ9 ఛాలెంజ్ టోర్నీ రెండో ఎడిషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది

Published By: HashtagU Telugu Desk
T9 Golf Challenge

F1a33c49 D537 4b7d Be90 Def84eb0047e

T9 Golf Challenge: తెలంగాణలో యువగోల్ఫర్లను ప్రోత్సహించేందుకు టీ గోల్ఫ్ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న టీ9 ఛాలెంజ్ టోర్నీ రెండో ఎడిషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. గచ్చిబౌలీ బౌల్డర్ హిల్స్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. దీనికి సంబంధించి ట్రోఫీని టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్‌ఆర్‌ఎన్‌ రెడ్డి, మాజీ క్రికెటర్లు చాముండి,వెంకటపతిరాజు, టోర్నీలో ఆడుతున్న జట్ల కెప్టెన్లతో కలిసి ఆవిష్కరించారు. 3 వారాల పాటు 9 రౌండ్లలో టోర్నీ జరగనుండగా.. మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ఆడతాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ట్రోఫీలతో పాటు 10 లక్షల ప్రైజ్‌మనీ దక్కనుంది. బౌల్డర్ హిల్స్ టైగర్స్‌ టీమ్‌కు మాజీ క్రికెటర్ చాముండి ఓనర్‌గా ఉండగా.. రైడర్స్, బౌల్డర్ నంజాస్, ఎకోలాస్టిక్ ఈగల్స్, జాగృతి జాగర్స్, నోవాటెల్ స్టార్స్, సిమెట్రిక్స్‌, టీజీఎఫ్ బ్యాక్ స్పిన్నర్స్‌ జట్లు పాల్గొంటున్నాయి. క్రికెట్‌లో టీ ట్వంటీ ఫార్మాట్ తరహాలోనే టీ9 ఛాలెంజ్ నిర్వహిస్తున్నట్టు టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్‌ఆర్‌ఎన్‌ రెడ్డి చెప్పారు. తమ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు యువ గోల్ఫర్లకు ఇది చక్కని వేదకగా చెప్పారు. తొలి ఎడిషన్‌లో బౌల్డర్ హిల్స్ టైగర్స్ విజేతగా నిలిచింది.

Read More: Asia Cup: ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆసియా కప్ కు డౌటే..?

  Last Updated: 25 Jun 2023, 11:06 AM IST