తెలంగాణ ఎన్నికల (2023 Telangana Elections ) సమయం దగ్గర పడుతుండడం తో రాష్ట్ర రాజకీయాలు మరింత జోరు అందుకున్నాయి. ఎవరు ఏ పార్టీ లోకి జంప్ అవుతున్నారో..? ఎవరు..ఎవరెవర్ని కలుస్తున్నారో..? చీకటి రాయబారాలు ఎలా జరుగుతున్నాయో..? ఎవరు గెలుస్తారో..? ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయో..? ఇలా ఎవరికీ వారు రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎన్నికలు బిఆర్ఎస్ (BRS) – కాంగ్రెస్ (Congress) మధ్య హోరాహోరీగా జరగబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తున్నాయి. రెండుసార్లు బిఆర్ఎస్ అధికారం చూసిన రాష్ట్ర ప్రజలు..ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు ఏ పార్టీ గెలుస్తుందో..ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారో అనేది చెప్పుకొచ్చాయి. ఇదిలా ఉంటె కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు..కేసీఆర్ ఫ్యామిలీ నేతలను టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి కేసీఆర్ ఫ్యామిలీ (KCR Family) నుండి ఎవర్ని గెలిచే ఛాన్స్ ఇవ్వకూడదన్నట్లు ప్లాన్ చేస్తున్నాయి. అందుకే కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు స్థానాల ఫై గట్టి నేతలనే నిలబెట్టాలని చూస్తున్నాయి. కామారెడ్డి నుండి రేవంత్ అన్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతే కాదు కేటీఆర్, హరీష్‌లపై ఉత్తమ్, కోమటిరెడ్డిలను నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రెండో జాబితాలో ఇదే హైలెట్ కానున్నాయని అంటున్నారు.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో ఆయనపై బీజేపీ తరపున ఈటల పోటీ చేస్తుండగా… కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని నిలబెట్టాలనే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తోంది. ఇప్పటివరకు కామారెడ్డి ఎవరికీ కంచుకోట కాలేదు. ఎప్పుడూ ఎకపక్ష ఎన్నికలు జరగలేదు. తెలంగాణ ఉద్యమం హైలో ఉన్నప్పుడు కూడా గట్టి పోటీనే జరిగింది. గంపా గోవర్దన్ 2009లో టీడీపీ నుండి గెలిచినా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి ,టిఆర్‌ఎస్ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు.
We’re now on WhatsApp. Click to Join.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ ఓట్లతోనే గంప గోవర్ధన్ బయటపడ్డారు. ఈ సారి రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే.. పరిస్థితి వేరుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. అలాగే కేసీఆర్‌కు వారసుడిగా ఎన్నికల బరిలో ఉన్న మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరో మంత్రి హరీశ్‌రావుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేసేలా.. టికెట్లను ఖరారు చేయాలని ఆలోచిస్తున్నారు. హైకమాండ్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరో వైపు పార్టీలో మరోసారి చేరబోతున్న రాజగోపాల్ రెడ్డి గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఇలా ఎవరికీ వారు కేసీఆర్ ఫ్యామిలీ నేతలను టార్గెట్ గా పెట్టుకొని బరిలోకి దిగబోతున్నారు. మరి ఈ పోరులో ఎవరు విజయం సాదిస్తారనేది చూడాలి.
Read Also : Telangana: తుమ్మల హెచ్చరికలు.. నెల రోజుల్లో అధికారంలోకి