Swiggy: స్విగ్గికి పండగే పండగ.. అంతా ఐపిఎల్ పుణ్యం అంటూ?

టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి కట్టుబొట్లలో పూర్తిగా మార్పులు వచ్చేసాయి. మరి ముఖ్యంగా మనుషుల ఆహారపు అలవాట్లు

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 07:05 PM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి కట్టుబొట్లలో పూర్తిగా మార్పులు వచ్చేసాయి. మరి ముఖ్యంగా మనుషుల ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఇదివరకటి రోజుల్లో ఆహారం కావాలి అంటే ఇంటిల్లిపాది ఒకరికొకరు సహాయం చేసుకుని మరి భోజనం చేసుకుని కలిసి తినేవారు. కానీ ఇప్పుడు మాత్రం వంట చేసుకోవడానికి బద్దకమై స్విగ్గి జొమాటో వంటి ఫుడ్ ఆర్డర్ల ద్వారా ఫుడ్ ని తెప్పించుకొని మరి తింటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే కాకుండా పల్లెటూర్లలో కూడా ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది.

దీంతో ఫుడ్ డెలివరీ యాప్ లకు రోజులో వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బర్త్డే వేడుకలు ఐపిఎల్ సీజన్ ఇటువంటి మంచి మంచి సీజన్లలో ఇంకా ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది స్విగ్గి సంస్థ. ఫుడ్ డెలివరీ యాప్ లు ఎన్ని ఉన్నా ఫేమస్ మాత్రం స్విగ్గియాపే అని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న న్యూ ఇయర్ 2023 సందర్భంగా ఏకంగా 3.5 లక్షల బిర్యానీలు అమ్ముడు అయినట్లు స్విగ్గి సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దానికి రెట్టింపుగా 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చినట్టు తెలిపింది స్విగ్గి సంస్థ. ఇన్ని ఆర్డర్లు రావడానికి గల కారణం కూడా లేకపోలేదు.

తాజాగా సోమవారం రోజున ఐపీఎల్ ఫైనల్ కావడంతో చాలామంది బిర్యానిలు పిజ్జాలు అంటూ స్విగ్గిలో కావలసినవి ఆర్డర్లు చేసుకున్నారు. ఇంకేముంది స్విగ్గి వారికి కాసుల పంట. ఏఐపీఎస్ సీజన్ లో రాని ఆర్డర్లు ఈ సీజన్ లో వచ్చినట్లు తెలిపింది స్విగ్గి సంస్థ. కేవలం ఒక నిమిషానికి నువ్వు 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. ఇదంతా ఐపీఎల్ పుణ్యమే అని చెప్పవచ్చు.