Chandrayaan 3 : విక్రమ్ ల్యాండర్‌ గా మారిన స్విగ్గీ డెలివరీ ఐకాన్..

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. తన డెలివరీ ఐకాన్ ను విక్రమ్ ల్యాండర్‌ గా మార్చుకుంది

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 02:18 PM IST

చంద్రయాన్ (Chandrayaan 3) ..ఇప్పుడు ఈ పేరు ప్రపంచం మొత్తం మారుమోగుతోంది. చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని అంత కోరుకుంటున్నారు. మరో మూడు గంటల్లో జాబిల్లి ఫై విక్రమ్ ల్యాండర్‌ (Vikram Lander) అడుగుపెట్టబోతుంది. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy).. తన డెలివరీ ఐకాన్ ను విక్రమ్ ల్యాండర్‌ గా మార్చుకుంది. మాములుగా మనం స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ పెడితే..ఆ డెలివరీ బాయ్ ఎక్కడి వరకు వచ్చాడనేది మనం యాప్ లో చూస్తాం..ఆలా చూస్తున్నప్పుడు స్విగ్గీ డెలివరీ బాయ్ సింబల్ కనిపిస్తుంటుంది. కానీ ఈరోజు మాత్రం విక్రమ్ ల్యాండర్‌ గుర్తు కనిపిస్తుంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవాలి చంద్రయాన్ సక్సెస్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.

నేడు సాయంత్రం గం.6.04 నిమిషాలకు ఇస్రో చంద్రయాన్-3 జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాడింగ్ (Vikram Lander Landing) చేయనుంది. ఈ అపూర్వఘట్టాన్ని వీక్షించేందుకు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. అలాగే ఈ ప్రయోగం సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఈ కీలక ఘట్టాన్ని వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. ఈ పూర్తి ప్రక్రియ 20 నిమిషాల పాటు ఉంటుంది. ఇది సక్సెస్​ అయితే ఇండియా చరిత్ర సృష్టిస్తుంది. ఈ 20 నిమిషాల కీలక సమయాన్ని టీ-20 (టెర్రర్​-20) అని పిలుస్తున్నారు. చంద్రుడిపై అన్వేషణ కోసం గత నెల 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం నేడు జాబిల్లిని తాకనుంది. జాబిల్లిపై అన్వేషణకు భారత్ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, సోవియెట్‌ యూనియన్‌, చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా నిలుస్తుంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగానూ చరిత్ర సృష్టించనుంది.

ఇక ఈ చంద్రయాన్ 3 ప్రయోగంలో తొలి నుంచి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్, వి.ఎస్. ఎస్. సి డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్, యు ఆర్ ఎస్ సి డైరెక్టర్ ఎం శంకరన్ లు కీలక పాత్ర పోషించడం జరిగింది.

Read Also : PM Modi – Chandrayaan 3 : మూన్ ల్యాండింగ్ ను ప్రధాని మోడీ.. దక్షిణాఫ్రికా నుంచి ఇలా వీక్షిస్తారట !