దేశంలోని శక్తి పీఠాలలోకెల్లా పర్వతంపై వెలసిన జగన్మాత ఎంతో శక్తివంతురాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు. నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజైన ఆదివారం బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇస్తున్న జగన్మాతను ఆయన దర్శించుకున్నారు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవస్థానం కార్య నిర్వహణాధికారి కె.ఎస్. రామరావు స్వామీజీని వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామీజీకి అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాన్ని అందచేశారు. జగన్మాతకు పేదలు అంటే ఎంతో ఇష్టమని స్వరూపానంద సరస్వతి తెలిపారు. దేవస్థానం ఉన్నత స్థాయి భక్తులతో సమానంగా పేదవారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వారికోసం ప్రతిరోజు కొంత సమయాన్ని అంతరాలయ దర్శనం కోసం కేటాయించాలని సూచించారు.
Durga Temple : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మని దర్శించుకున్న శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి

Durga temple