Swapnika: ప్రపంచ చలన చిత్రోత్సవానికి ఎంపికైన ‘స్వప్నిక’ డాక్యుమెంటరీ!

వైకల్యం ఎదురైనా.. అనుకున్నది సాధించి జీవితాన్ని జయించవచ్చని స్వప్నిక డాక్యుమెంటరీ ద్వారా డైరెక్టర్ చూపించారు.

  • Written By:
  • Updated On - March 20, 2023 / 05:18 PM IST

చిల్కూరి సుశీల్ రావు తెరెక్కించిన‌ ‘స్వప్నిక’ అనే డాక్యుమెంటరీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివా-23 కు ఎంపికైంది. ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రదర్శంపబడింది. స్వప్నిక అనే అమ్మాయి కథ. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ఆమె చిన్నప్పుడు విద్యుదాఘాతానికి గురై రెం డు చేతులను కోల్పోతుంది. స్వప్నిక తన సంకల్పం, పట్టుద‌ల‌తో డిగ్రీ చదువును పూర్తి చేస్తుంది. శారీరక వైకల్యం ఎదురైనా.. అనుకున్నది సాధించి జీవితాన్ని జయించవచ్చని స్వప్నిక డాక్యుమెంటరీ ద్వారా డైరెక్టర్ చూపించారు. “నోస్టాల్జియా” పేరుతో చిల్కూ రి సుశీల్ రావు రూపొందించిన మరో డాక్యుమెంటరీ సికింద‌రాబాద్‌లోని 111 ఏళ్ల నాటి స్కూల్ సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్‌లో ‘నోస్టాల్జియా’ రోజు కోసం వృద్ధ విద్యార్థులు కలిసి ఎలా జరుపుకున్నారనే నేప‌థ్యంతో ఉంది.

ఈ ఫిల్మ్ కు సంగీత దర్శకుడు బెనో జోసెఫ్ మ్యూజిక్ అందించగా, ఎలిజా ఇమ్మాన్యు యేల్ సమర్పకులు. నిషాన్ సంప్రీత్ చిల్కూరి పథ్య గాయకుడు. ఈ రెండు డాక్యుమెంటరీలను చిల్కూ రి సుశీల్ రావు నిర్మించి దర్శకత్వం వహించారు. 55 ఏళ్ల చిల్కూరి సుశీల్ రావు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు. గత ముప్ఫై ఐదేళ్లుగా పాత్రికేయునిగా కొనసాగుతున్నా రు. అతను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీ జర్నలిజం విభాగం నుంచి గోల్డ్ మెడ‌ల్‌ సాధించారు. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సి టీలో ఫిల్మ్ అం డ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ ఇం డియా (ఎఫ్‌టీఐఐ) కోర్సులు చేశారు.

సినిమా స్టడీస్‌పై మద్రాస్ ఐఐటీ నుంచి సర్టిఫికెట్‌ కోర్సు చేశారు. అతను కేరళ యూనివ‌ర్సిటీ నుంచి ఫిల్మ్ అప్రిషియేషన్‌లో కోర్సు పూర్తి చేశారు. చిల్కూరి సుశీల్ రావు ప్రస్తుతం హైదరాబాద్‌లోని టి-హబ్‌లో అందించే ‘సినీప్రెన్యూర్’ కోర్సును కూడా అభ్యసిస్తున్నారు. ఈ కోర్సు MEE స్కూల్ సహకారంతో అందిస్తున్నారు. డిసెంబర్ 2022లో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌ లో జరిగిన తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిల్కూ రి సుశీల్ రావు “ఇండియాస్ గ్రీన్‌హార్ట్ దుశర్ల సత్య నారాయణ” ఉత్తమ జ్యూ రీ అవార్డును అందుకున్నారు. చిల్కూరి సుశీల్ రావు నిర్మించి దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీలు కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రెంచ్ రివేరా, ఫ్రాన్స్‌ లో కూడా మంచి పేరును అందించాయి.