కుటుంబ కలహాలతో కెనాల్‌లో ఇద్దరు చిన్నారుల (Childrens)ను పడేసి తల్లి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బాన్సువాడ (Bansuwada)లో జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చక్రధర్ తండాకు చెందిన అరుణ.. పిల్లలు యువరాజ్(4), అనన్యలను బాన్సువాడ పోచమ్మ ఆలయం వద్ద ఉన్న వాగులో పడేసి తాను దూకింది. ఈ ఘటన సోమవారం రాత్రి బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న పెద్ద పూల్ వాగు కాలువలో జరిగింది.
పోలీసులు చిన్నారుల మృతదేహాలను బయటకు తీసి అరుణను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన చిన్నారులు అనన్య (6 నెలలు), యువరాజ్ (4 ఏళ్లు) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భర్తతో గొడవల కారణంగా ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.