Site icon HashtagU Telugu

Shooting Championship : తెలంగాణ షూటింగ్ పోటీల్లో కాంస్యం సాధించిన ఉత్తరాఖండ్ బాలుడు

Suryansh Badoni

Suryansh Badoni

జూన్ 2025లో జరిగిన 11వ తెలంగాణ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‌షిప్ (Shooting Championship) పోటీల్లో ఉత్తరాఖండ్ (UP) రాష్ట్రానికి చెందిన గర్భ్వాల్ ప్రాంతానికి చెందిన సూర్యాంశ్ బడోని (Suryansh Badoni) మంచి ప్రతిభను కనబరిచాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సబ్ యూత్ కేటగిరీ(Sub Youth Category)లో కాంస్య పతకాన్ని (Olympic Gold) సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో తన ప్రతిభతో మూడో స్థానం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Wife Kills : అయ్యో… భార్య చేతిలో బలైపోయిన భర్త

కేవలం 12 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించిన సూర్యాంశ్ బడోని, తాను భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని సాధించాలని కలలు కంటున్నాడు. చిన్న వయసులోనే పిస్టల్‌పై ఆసక్తి పెంచుకున్న సూర్యాంశ్, కేవలం ఒకే ఒక్క సంవత్సరంలోనే ఈ క్రీడను నేర్చుకొని ఈ స్థాయికి ఎదగడం గమనార్హం. తన కృషి, పట్టుదల, కుటుంబ సహకారం కారణంగానే ఈ విజయాన్ని సాధించగలిగాడని అంటున్నారు.

YS Jagan Sattenapalli Tour : మరో ప్రాణం పోవడానికి జగన్ పరోక్షంగా కారణమయ్యాడు

తక్కువ కాలంలోనే ప్రతిభ కనబర్చిన సూర్యాంశ్, ఇప్పుడు మరింత కష్టపడి నేషనల్ స్థాయిలో మెడల్స్ సాధించి, అంతర్జాతీయ పోటీలకు అర్హత పొందాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. తన చిన్న వయస్సులోనే గొప్ప కలలతో ముందుకెళ్తున్న ఈ బాలుడికి అవసరమైన ప్రోత్సాహం లభిస్తే, అతను తప్పకుండా భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తాడని విశ్వాసం వ్యక్తమవుతోంది. అతడి విజయం చాలా మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా మారింది.

Exit mobile version