చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనా ఫాన్స్ కు గుడ్ న్యూస్…రైనా ఐపీఎల్ లో ర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏ టీమ్ కొనుగోలు చేసింది అనుకుంటున్నారా…రైనా ఆటగాడిగా కాదు కొత్త రోల్ లో కనిపించబోతున్నాడు. మెగా వేలంలో సురేశ్ రైనాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. రూ.2 కోట్ల కనీస ధరతో మెగా వేలం బరిలో నిలిచిన రైనా అమ్మడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. అయితే మిస్టర్ ఐఐపీఎల్‌గా పేరున్న రైనా ఈ సీజన్ కోసం సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 15వ సీజన్లో కామెంటేటర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ సారి ఐపీఎల్ లో సురేష్ రైనా తో పాటుగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా కామెంటేటర్‌గా కనపించనున్నాడు.
2017లో భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియామకమైన రవి శాస్త్రి గతేడాది కోచ్ బాద్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ లో సురేష్ రైనా, రవి శాస్త్రి హిందీ కామెంటేటరీలో పాల్గొననున్నట్లు ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సంస్థ ప్రకటించింది. ఇక ఐపీఎల్ 2016, 2017 సీజన్ మినహా ప్రారంభ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆడిన సురేష్ రైనా.. 205 మ్యాచ్‌ల్లో 32.52 సగటు, 135కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున 176 మ్యాచ్‌లు ఆడిన సురేశ్ రైనా.. 32.32 సగటుతో 4687 పరుగులు చేశాడు.