Site icon HashtagU Telugu

Raina: రైనాపై ధోనీకి నమ్మకం లేదు

Ms Dhoni Suresh Raina

Ms Dhoni Suresh Raina

బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో కొందరు స్టార్‌ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. ముఖ్యంగా చెన్నై సూపర్‌ కింగ్స్ స్టార్‌ బ్యాటర్‌ మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈసారి వేలంలో రైనాను తీసుకోకపోవడంపై తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్ సైమన్ డౌల్ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో అటు ధోని ఇటు చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం నమ్మకాన్ని రైనా కోల్పోయాడని, అందుకే అతన్ని తిరిగి కొనుగోలు చేయలేదని, సైమన్ డౌల్ అన్నాడు. ఐపీఎల్ 15వ సీజన్ మెగా వేలంలో సురేష్ రైనాను ఎవరూ కొనుగోలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా యూఏఈలో అతడు చెన్నై ఫ్రాంచైజీ విశ్వాసాన్ని కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ యజమానే స్వయంగా వెల్లడించాడు. అటు తర్వాత చెన్నై సారథి ధోని నమ్మకాన్ని కూడా రైనా కోల్పోయాడు.. ఒక ఆటగాడిపై సొంత జట్టే ఆసక్తి చూపకపోతే , ఇతర జట్లు ఆ ప్లేయర్ ను అసలే కొనుగోలు చేయవు అని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు.

ఇదిలాఉంటే.. . ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 205 మ్యాచ్‌లాడిన రైనా 5,528 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న రైనా.. ఒక్క చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరఫునే 4,687 పరుగులు చేయడం విశేషం..ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి 2015 వరకూ చెన్నై సూపర్ కింగ్స్‌కే సురేశ్ రైనా ఆడాడు… ఆ తర్వాత 2016, 2017 సీజన్లలో చెన్నై ఫ్రాంచైజీపై నిషేధం విధించగా.. ఆ రెండేళ్లు గుజరాత్ లయన్స్ జట్టుకి కెప్టెన్‌గా రైనా ఉన్నాడు. మళ్ళీ ఐపీఎల్ లోకి చెన్నై సూపర్ కింగ్స్ అడుగుపెట్టగానే..రైనా అందులోకి ఎంట్రీ ఇచ్చాడు.