Modi Surname Remark: ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో తనకు శిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై సూరత్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ‘మోదీ ఇంటిపేరు’పై ఆయన చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో అతనిపై విధించిన శిక్షపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు.
మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అతనిపై కొనసాగుతున్న పరువు నష్టం కేసులో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించడంతో ఈ శిక్ష పడింది. అయితే ఈ శిక్షపై రాహుల్ అప్పీల్ చేయడంతో ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టు కాంగ్రెస్ నేతకు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు, అయితే సూరత్‌లో కోర్టు మార్చి 23న ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో తన పదవిపై అనర్హత వేటు పడింది.
ఏప్రిల్ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. మోడీ ఇంటి పేరు గల వారందరూ దొంగలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీపై గుజరాత్ బీజేపీ నేత పూర్ణేష్ పరువునష్టం కేసు దాఖలు చేయడంతో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. మోదీతో పాటు మొత్తం ఓబీసీ వర్గానికి వ్యతిరేకంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది.
Read More: PBKS vs RCB: ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర పోరు.. పంజాబ్ ను బెంగళూరు జట్టు ఓడించగలదా..?